బాసర, మార్చి 17 : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. మెదక్ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన మల్లిపూడి తేజస్విని బాసరలోని ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్నది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధడుతున్నది.
ఈ నెల 13న జ్వరం రావడంతో క్యాంపస్ దవాఖానలో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఆమెను గాంధీ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్టు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు.