ప్రాణాలు తీసిన పిడుగుల వాన
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి భారీగా ప్రాణ నష్టం జరిగింది. పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన పిడుగుల వానకు ఒకేరోజు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున వరదనీరు చేరి పట్టణాలు, కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి.
- రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మృత్యువాత
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
- 3, 4 రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు
న్యూస్‌నెట్‌వర్క్, జూన్ 6 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి భారీగా ప్రాణ నష్టం జరిగింది. పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన పిడుగుల వానకు ఒకేరోజు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున వరదనీరు చేరి పట్టణాలు, కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. వివిధ మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయింది. పలు చోట్ల చెట్లు కూలిపడి విద్యుత్తు తీగలపై పడటం వల్ల కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల కూలిన చెట్లు రోడ్లపై అడ్డంగా పడటంతో ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలిగింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన యువరైతు ముడపల్లి ప్రవీణ్ (26), తానూర్ మండలంలోని ఎల్వత్ గ్రామానికి చెందిన మాగీర్వాడ్ శ్రీ (10) పిడుగు పడి మృతి చెందారు.
ప్రవీణ్‌కు భార్య అశ్విని, కూతురు శ్రీనిక (ఏడాది) ఉన్నారు. మెదక్ జిల్లా హవేళీఘన్‌పూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్ధయ్య (50), ఓడంగల నందు (22) దుర్గమ్మ గుట్టకు వెళ్లగా పిడుగు పడి అక్కడిక్కడే మృతిచెందారు. కౌడిపల్లి మండలం పీర్లతండాకు చెందిన గెమ్యానాయక్ (53) సలాబత్పూర్ గ్రామ శివారులో గొర్రెలు మేపుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లో అమరగొండ ఎల్లయ్య అనే గొర్రెల కాపరి పిడుగుపాటుతో గాయాలపాలయ్యాడు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో పొలంలో విత్తనాలు నాటుతున్న భార్యాభర్తలు పిడుగుపాటుకు గురయ్యారు. బేగరి జంగమ్మ (40) మృతి చెందగా.. భర్త కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వారిని కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దండిగుట్ట తండాకు చెందిన బానోవత్ పీర్యానాయక్ (85) సమీప గ్రామమైన కళ్యాపూర్ శివారులో గేదెలు మేపుతుండగా పిడుగుపడి ఛాతి కింది భాగంలో మంటలు అంటుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డోంగర్‌గాం గ్రామానికి చెందిన అనక సంతోష్ (27), ఆయన భార్య స్వప్న (24)పై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి ఏడాది పాప భాను ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని మల్కాపూర్ గ్రామంలో తాడిచెట్టుపై పిడుగు పడింది.
ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖానాపూర్ మండలంలో పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఒకవైపు తూకం వేసిన ధాన్యం తరలించకుండానే తడిసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజులుగా తూకం వేసేవాళ్లు కరువయ్యారు. వ్యవసాయ పొలంలో రెండు ఆవులు మేత మేస్తుండగా పిడుగు పడి మృత్యువాత పడ్డాయని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. రెండు నెలలైనా తమ ధాన్యం తూకం వేయలేదని, పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంతోనే నష్టపోయామని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

