హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తన బిడ్డ నిఖత్ జరీన్ ఈ స్థాయికి ఎదగడానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందించిన ప్రోత్సాహమే కారణమని ఆమె తండ్రి ఎండీ జమీల్ అహ్మద్ పేర్కొన్నారు. భారత స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె తండ్రి జమీల్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా అవార్డును అందుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఒక తండ్రిగా నిఖత్ జరీన్‌కు తాను చేసింది కొంతేనని, కేసీఆర్, కవిత సహకారం లేకపోతే ఈ స్థాయికి వచ్చేది కాదని చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద జరిగిన అనేక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన విషయం
తెలిసిందే.