ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ విద్యార్థులు కాలేజీ రోజుల్లోనే నేర్చుకునేలా UGC, AICTE నిబంధనలకు అనుగుణంగా యూనివర్సిటీలకు కరికులం మొదలుకొని మౌలిక సదుపాయాల వరకు అనేక అంశాలను మెరుగుపరచడానికి NIAT కృషి చేస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 మార్గదర్శకత్వంలో భారతదేశ విద్యావ్యవస్థవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ మార్పులో UGC, AICTE సంస్థలు విద్యను నైపుణ్యానికి పెద్దపీట వేసేలా మార్చేందుకు ఎంతగానో కృషి చేస్తూ అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఆశయాన్ని వేగంగా ముందుకు తీసుకు వెళ్లడానికి నెక్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ (NIAT)ప్రారంభించిన యూనివర్సిటీ భాగస్వామ్య మోడల్ని భారతదేశంలోని పలు యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీలు అమలు పరుస్తున్నాయి. నైపుణ్య ఆధారిత విద్యకు దేశవ్యాప్తంగా అనుకరించదగినదిగా ఈ మోడల్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
“విద్యార్థులకు చక్కటి కెరియర్ ఫలితాలు తీసుకువచ్చేలా యూనివర్సిటీలను బలపరచడమే ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం” అని నెక్ట్ వేవ్ & NIAT కో ఫౌండర్ మరియు సీఈవో రాహుల్ అత్తులూరి అన్నారు. “ఒకవైపు యూనివర్సిటీ అకడమిక్ ప్రోగ్రామ్‌ను తమదైన విధంగా కొనసాగిస్తుంది. మరోవైపువిద్యార్థులు ఇండస్ట్రీకి సిద్ధమవ్వడానికి అవసరమైన ప్రతిదీ హ్యాండ్స్-ఆన్ స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ప్రాక్టీషనర్ల నుంచి సెషన్స్, ఫ్యాకల్టీ ట్రైనింగ్, ఇంటర్న్షిప్స్, ప్లేస్‌మెంట్స్ ఇలా కావల సిన అన్నింటిలో NIAT తోడ్పాటు నందిస్తుంది”. అని తెలిపారు. ఈ భాగస్వామ్యంలో యూనివర్సిటీల కరికులంని మెరుగుపరచడానికి NIAT ఇన్సైట్స్ ఇవ్వడం ఒక కీలకమైన అంశం. ఈ ఇన్సైట్స్ని 3,000కి పైగా కార్పొరేట్ కంపెనీలు, 10,000కి పైగా టెక్ ప్రొఫెషనల్స్ కమ్యూనిటీ, తమ అంతర్గత R&D ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇలా అనేక మూలాల నుంచి NIAT సేకరిస్తుంది.
ఈ ఇన్సైట్స్ని NIAT యూనివర్సిటీలకు స్ట్రక్చర్డ్ రిపోర్ట్స్, వైట్ పేపర్స్ రూపంలో సమర్పిస్తుంది. వీటిలో లేటెస్ట్ ఇండస్ట్రీ ట్రెండ్స్, జాబ్ రోల్స్, స్కిల్ గ్యాప్స్ వంటి అంశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా AI/ML, సైబర్ సెక్యూరిటీ వంటి 4.0 టెక్నాలజీలకు సంబంధించినవి. ఈ రిపోర్ట్స్ ఆధారంగా యూనివర్సిటీలు UGC, AICTE నిబంధనలకు అనుగుణంగా తమ అకడమిక్ కౌన్సిల్స్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదంతో వారి కరికులంని ఆధునికీకరిస్తాయి. అధునాతన టెక్నాలజీలలో ప్రాక్టికల్ స్కిల్స్ పెంపొందేలా
ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వడం కూడా NIAT మోడల్లో మరో ముఖ్యమైన అంశం. వారికి కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలపై పట్టుసాధించే విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్, ల్యాబ్స్, హ్యాండ్స్-ఆన్ కోడింగ్ సెషన్స్‌తో ఈ శిక్షణ ఉంటుంది. అలానే NIAT యొక్క 10,000 + టెక్ ప్రొఫెషనల్స్ నెట్వర్క్ని ఉపయోగించుకుంటూ అందులోని ఎక్స్పర్ట్స్ ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లాగా నియమించుకోవచ్చు. ఇలాంటి వారు మెంటర్ చేయడం వలన విద్యార్థులు ఇండస్ట్రీలో వాడే లేటెస్ట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ పై పట్టు సాధిస్తారు.
ప్రపంచస్థాయి నిపుణుల్లా తయారవ్వాలంటే డిగ్రీతో పాటు స్కిల్స్, యాప్టిట్యూడ్ అవసరం. NIAT సహకారంతో మా విద్యార్థులు గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు అని డాక్టర్ రాకేష్ కుమార్ జైన్, వైస్ ఛాన్సలర్, అజీంక్య డి.వై. పాటిల్ యూనివర్సిటీ అన్నారు. అనుభవ పూరితంగా నేర్చుకోవాలంటే ఒక అధునాతన టెక్ వ్యవస్థ అవసరం అవుతుంది. అందుకే NIAT రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫాంను యూనివర్సిటీలు అమలు చేస్తున్నాయి. ఈ వ్యవస్థ విద్యార్థులు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసేలా, చేసిన టాస్క్‌పై వెంటనే లైవ్ ఫీడ్‌బ్యాక్ వచ్చేలా, విద్యార్థులు ఏ అంశంలో బలహీనంగా ఉన్నారో చూపిస్తూ ఎలా ఇంప్రూవ్ అవ్వాలో కూడా చెబుతోంది. ఇవన్నీ ఇప్పటి వరకూ టాప్ కంపెనీల బూట్ క్యాంప్‌లలో మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు విద్యార్థులకు యూనివర్సిటీలోనే ఈ తరహా సదుపాయాలను NIAT అందుబాటులోకి తీసుకు వస్తుంది.
శ్రీ ఫర్హాద్ యనపోయా, ప్రో-ఛాన్సలర్, యనపోయా డీమ్డ్ యూనివర్సిటీ మాట్లాడుతూ “ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం ప్రతి విద్యార్థికి అవసరం. NIAT సపోర్టుతో మా డిగ్రీ ప్రోగ్రాం మరింత శక్తివంతంగా మారింది. విద్యార్థులను టెక్నాలజీ రంగంలో చక్కటి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుంది”. అని అన్నారు. ఇప్పటి తరానికి కావాల్సింది కేవలం తరగతి గదులు కాదు. టెక్‌తో కూడిన అధునాతన క్లాస్ రూమ్‌లు. దాన్ని దృష్టిలో పెట్టుకుని NIAT, యూనివర్సిటీలకు ఒక ప్రత్యేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ ప్లేబుక్ అందిస్తుంది. ఇది స్టాన్‌ఫర్డ్ ఎమ్ ఐటీ, హార్వర్డ్ లాంటి టాప్ యూనివర్సిటీలను బెన్చ్ మార్క్ చేసి, భారతీయ విద్యా పరిస్థితులకు తగ్గట్టు రూపొందించబడింది. హై-స్పీడ్ Wi-Fi, టెక్ టూల్స్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్ AV సిస్టమ్స్,
సౌండ్‌ప్రూఫ్ గదులు, కంఫర్టబుల్ అండ్ ఎర్గోనామిక్ సీటింగ్, టీమ్ వర్క్‌కి తగిన కోలాబొరేటివ్ లేఅవుట్స్ ఇలా ప్రాజెక్టు బేస్డ్ లెర్నింగ్కి అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయి. అవే కాకుండా, ప్లేబుక్‌లో క్లియర్‌గా బిల్ ఆఫ్ క్వాంటిటీస్, వెండర్ టెంప్లేట్స్, రోల్ అవుట్ మైల్‌స్టోన్స్ కూడా ఉంటాయి. దీంతో యూనివర్సిటీలు AICTE నిబంధనలతో పాటు ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా కూడా మెయింటెయిన్ చేయగలుగుతున్నాయి. NIATతో భాగస్వా మ్యంలో యూనివర్సిటీలకు లభించే మరో గొప్ప విషయం ఇండస్ట్రీతో ఉండే డైరెక్ట్ కనెక్షన్. 3000కి పైగా టెక్ కంపెనీలలోని అవకాశాలకు విద్యార్థులను కనెక్ట్ చేస్తుంది. యూనివర్సిటీ స్టూడెంట్స్ చక్కటి కెరీర్లకు సిద్ధమయ్యే విధంగా స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్స్, మాక్ అసెస్మెంట్స్, ఇండస్ట్రీ ప్లేస్మెంట్ సెషన్స్ ఉంటాయి. అలానే, ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేసేందుకు డేటా డాష్‌బోర్డులు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో యూనివర్సి టీలు ఒక్కో విద్యార్థి ఎంత ప్రిపేర్ అయ్యాడు, ఏది అవసరం అనే విషయాలపై క్లారిటీతో ఉండగలుగుతున్నాయి.
డాక్టర్ సిహెచ్.వి. పురుషోత్తం రెడ్డి, చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ మాట్లాడుతూ “ప్రస్తుత ప్రపంచంలో చక్కటి కెరియర్ కోసం డిగ్రీతోపాటు స్కిల్స్ కూడా అవసరం. మా యూనివర్సిటీ నుంచి డిగ్రీ, NIAT నుంచి ఇండస్ట్రీ-రెడీ సర్టిఫికేట్ పొందుతారు. ఈ విధంగా విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందించడానికి ఎంతో కీలకం” అని అన్నారు.
విద్యార్థులకు ఒకవైపు యూనివర్సిటీ నుంచి UGC అప్రూవ్డ్ బీటెక్ డిగ్రీ మరొకవైపు NIAT నుంచి ఇండస్ట్రీ-రెడీ సర్టిఫికేట్ అప్రూవ్డ్ (IRC) కూడా వస్తుంది. ఈ IRC అన్నది విద్యార్థులు చేసిన స్కిల్ ట్రైనింగ్, ప్రాజెక్ట్‌లు, అసెస్మెంట్లు బట్టే ఇవ్వబడుతుంది. ఇలా డిగ్రీతో పాటు స్కిల్ సర్టిఫికేట్ కూడా రావడం వల్ల, విద్యార్థులకు జాబ్ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. దీంతో పాటు, మల్టీడిసిప్లినరీ, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే UGC/AICTE లక్ష్యాలకి కూడా చక్కగా సరిపోతుంది. డాక్టర్ శ్రీలత చేపూరి, వైస్ ఛాన్సలర్, ఆరోరా డీమ్డ్ యూనివర్సిటీ మాట్లాడుతూ “2025-26 నుంచి NIATతో కలిసి, మా క్యాంపస్‌లో డిగ్రీకి తోడుగా అప్ స్కిలింగ్ ట్రైనింగ్‌తో విద్యార్థులకు పూర్తి స్కిల్ సెట్ అందేలా చేస్తున్నాం. వారి కెరీర్ బలంగా ప్రారంభం అవుతుందని మా నమ్మకం” అని అన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫీజు స్ట్రక్చర్ పూర్తిగా క్లియర్‌గా ఉంటుంది. విద్యార్థులు అకాడమిక్ ఫీజు నేరుగా యూనివర్సిటీకే. ఇంకా, NIAT అందించే ఇండస్ట్రీ రెడినెస్ ప్రోగ్రామ్ కోసం వేరుగా (ఐచ్చికంగా) ఫీజు ఉంటుంది. ఇలా ఫీజులు వేరుగా ఉండడం వల్ల UGC, AICTE నిబంధనలకి పూర్తిగా అనుగుణంగా ఉంది.“ఇదే ప్రభుత్వం కోరుకున్న నైపుణ్య ఆధారిత విద్యా”, అని అన్నారు రాహుల్ అత్తులూరి, కో-ఫౌండర్ & సీఈవో, నెక్ట్స్ వేవ్ & NIAT. ‘UGC, AICTE ఈ మార్పు కోసం కీలకమైన
సంస్కరణలు తీసుకొస్తున్నాయి. వాటికి అనుగుణంగా, మేము ఒక పక్కాగా పనిచేసే మోడల్‌ను నిర్మించాం. ఇది ఇప్పుడు యూనివర్సిటీలలో, విద్యార్థుల భవిష్యత్తులో నిజంగా మార్పు తీసుకొస్తోంది. డిగ్రీతోపాటు, ఒక భరోసా కలిగిన భవిష్యత్తు కూడా ఇవ్వగలగటం ఈ భాగస్వామ్యం ప్రత్యేకత” అని అన్నారు.