5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. సైబర్ టెర్రరిజంపై రామగుండంలో అనుమానితుడి విచారణ
గుజరాత్లో వెలుగు చూసిన సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గుజరాత్లో వెలుగు చూసిన సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని పుణె జిల్లా జున్నార్, గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాద్, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండం, బీహార్‌లోని గోపాల్‌గంజ్, ఢిల్లీలో ఈ సోదాలు జరిగాయి. సైబర్ ఉగ్రవాద కుట్ర ఆరోపణలకు సంబంధించి అహ్మదాబాద్‌లో 2025లో కేసు నమోదైంది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 54 వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక డీడీవోఎస్ దాడులకు నిందితులు యత్నించారు. దేశంలోని కీలక కంప్యూటర్ వనరులు, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(సీఐఐ)పై ప్రభావం చూపడంతో పాటు దేశ సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతను దెబ్బతీయడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులకు ప్రయత్నించినట్టు ఎన్ఐఏ పేరొన్నది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక విశ్లేషణ చేపట్టిన ఎన్ఐఏ, అరస్టైన నిందితులకు డీడీవోఎస్ దాడులకు పాల్పడేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ఇతర సహాయ సహకారాలు అందించినట్టు అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించింది.
కోర్టు నుంచి సెర్చ్వారెంట్లు పొందిన అనంతరం సోమవారం అనుమానితుల నివాసాలు, సంబంధిత ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. సోదాల్లో 3 ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు సహా ఇతర డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. ఈ కేసులో భాగంగానే గుజరాత్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం రామగుండం అయోధ్యనగర్‌లోని ముజామిల్‌ఖాన్‌ను విచారించారు. వచ్చే నెల 15న సికింద్రాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

