హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రం లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మంతోపాటు కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 14జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.