TG Weather | తెలంగాణలో అప్పటి వరకు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ..!
TG Weather | తెలంగాణలో ఈ నెల 12 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
TG Weather | తెలంగాణలో ఈ నెల 12 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉత్తర గుజరాత్, నైరుతి రాజస్థాన్ మీదుగా ఉన్న వాయుగుండంతో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. మధ్యప్రదేశ్ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు సగటు సముద్రమట్టానికి 3.2 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపునకు వంగి ఉందని పేర్కొంది.
వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి .31 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించింది. మంగళవారం ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని చెప్పింది.
బుధవారం భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని వెల్లడించింది. గురువారం భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని.. శుక్రవారం జగిత్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది. ఇదిలా గడిచిన 24గంటల్లో పలుజిల్లాల్లో వర్షాలు కురిశాయి. హన్మకొండ జిల్లా దామెరలో 6.4, వరంగల్ జిల్లా పైడిపల్లిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ తెలిపింది.
Read Also :
Lunar Eclipse | కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం.. ఎరుపు వర్ణంలోకి మారిన చంద్రుడు.. Photos
Lunar Eclipse | ప్రత్యేక చంద్రగ్రహణం.. నేటి నుంచి ఐదురాశుల వారికి అన్నీ కష్టాలే..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

