TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ..!
TG Weather | నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గురువారం మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ పేర్కొంది.
TG Weather | నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గురువారం మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ పేర్కొంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతూ రాబోయే 24గంటల్లో మరింత బలపడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.
గురువారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది.
శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ మేరకు వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

