కృష్ణ, జూలై 10 : పసికందును రైలు పట్టాల పక్కన వదిలివెళిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్నది. రైల్వే ఎస్సై రాజు కథనం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు పది రోజుల మగ శిశువును వదిలేసి పోయారు.
శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు శిశువును మక్తల్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్టు వారు తెలిపారు. శిశువును చైల్డ్ హెల్ప్ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.