హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఎటువంటి వాతావరణ పరిస్థితుల్ల్లోనైనా తట్టుకొనే విధంగా ఆర్మీకి ఆధునిక యూనిఫాం సిద్ధమవుతున్నది. సైన్యానికి త్వరలోనే డిజిటల్ డిస్ట్రిప్టివ్ ప్యాటర్న్ కంబాట్ యూనిఫారాన్ని తీసుకొచ్చేందుకు రక్షణశాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇతర దేశాల మిలిటరీ యూనిఫారాలను పరిశీలించి, విస్తృతస్థాయి చర్చల అనంతరం ఈ దుస్తులను ఖరారు చేశారు. ధరించేందుకు తేలికగా, పర్యావరణానికి అనుకూలం గా ఉండే ఈ కొత్త డ్రెస్ రెండేండ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఆధునిక యుద్ధతంత్రంలో ఈ డ్రస్ కీలకంగా మారనున్నదని చెప్తున్నారు. ఈ డ్రెస్ డిజైనింగ్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పాలుపంచుకొన్నది.
యూనిఫాం ప్రత్యేకతలు