మే 14( నమస్తే తెలంగాణ) : తెలంగాణ చరిత్ర, సంసృతిని నేటి తరానికి దృశ్య-శ్రవణ మాధ్యమాల ద్వారా అందించేందుకు నూతన తెలంగాణ చరిత్ర బృందం ప్రతిష్టాత్మకమైన ‘బొమ్మల పల్లకి’ పేరుతో వీడియో పోటీలు నిర్వహిసున్నారు. ఈ పోటీలో పాల్గొనే వాళ్లు గరిష్ఠంగా 10 నిమిషాలు నిడివిగల వీడియో పంపాలని నిర్వాహకులు తెలిపారు. స్థానిక చరిత్ర(వ్లాగింగ్), అజ్ఞాత చరిత్ర, ఏఐ ద్వారా సృష్టించిన చారిత్రక దృశ్యాలు, ఆహార సంసృతి, అంతరించిన వస్తువులు, అరుదైన చిత్రాల వివరణ, ప్రకృతి వనరులు, సాంసృతిక ఉత్సవాలు తదితర అంశాలపై వీడియోలు పంపించవచ్చని వారు పేర్కొన్నారు.
ఈనెల 29 లోగా అందజేయాలని, జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విజేతల వీడియోలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఆగస్టులో బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. వారు తమ వీడియోలను 97041 23969 నంబర్‌కు వాట్సాప్ డాక్యుమెంట్ ద్వారా లేదా kothatelanganacheritra@gmail.comకు గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా పంపవచ్చు. వీడియోతోపాటు వ్యక్తిగత వివరాలు జతపరచాలి. లింక్: వివరాలకు 99494 98698 నంబర్‌పై సంప్రదించాలని తెలంగాణ చరిత్ర బృందం నిర్వాహకులు కోరారు.