హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కోర్సుల సిలబస్ మారనున్నది. వచ్చే విద్యాసంవత్సరం వరకు కొత్త సిలబస్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడున్న సిలబస్‌ను సమీక్షించి కొత్త సిలబస్ ఖరారుచేస్తారు. ప్రభుత్వం 12 మందితో ఉన్నతస్థాయి కమిటీ వేసింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.
కొత్త మెడికల్ కాలేజీలకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : 2026-27 విద్యాసంవత్సరానికి కొత్త మెడికల్ కాలేజీ(యూజీ)ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) ప్రకటించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఎంసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 29 నుంచి జనవరి 28 సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు అందజేయాలని కోరింది. అయితే కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఉన్న సీట్ల పెంపునకు ఫీజును ఎన్ఎంసీ భారీగా పెంచింది.