ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనం అమెరికాలో వైట్‌హౌజ్ కాదు.. వనపర్తి జిల్లా ఎస్సీ కార్యాలయం. జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవనం ప్యాలెస్‌లా కనిపిస్తూ అందరి చూపులను ఆకట్టుకొంటున్నది. ఆధునాతన డిజైన్లతో నిర్మితమవుతున్న ఈ భవనం అతి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది.