కాంగ్రెస్‌లో గెలిపించే నాయకుడే లేడు
- నా అనుమతి లేకుండా భువనగిరి టికెట్ ఇవ్వొద్దు: ఎంపీ కోమటిరెడ్డి

భువనగిరి అర్బన్, జూలై 8: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించే నాయకుడు ఎవరూ లేరని ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గెలిపించడం పీసీసీ నాయకుడి వల్ల, ఇతర ఏ నాయకుడి వల్ల కూడా కాదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదని తెలిపారు. గురువారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా భువనగిరిలోని కిసాన్‌నగర్‌లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించే నాయకుడే లేడని, ఒకవేళ ఉంటే జీహెచ్ఎంసీలో ఓటమి ఉండేది కాదని అన్నారు. గాంధీభవన్‌లో స్పీచ్‌లు ఇచ్చే నాయకులు, కమిటీలో పేరు వచ్చిన నాయకులు.. తమ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని గెలిపించుకురావాలని సూచించారు. తన అనుమతి లేకుండా భువనగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ టికెట్ ఇవ్వొదని కోరారు. లీడర్లు అందరు గాంధీభవన్‌లో ఖాళీగా కూర్చొని ప్రెస్మీట్లకు పరిమితం కావద్దని హితవుపలికారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఇప్పటివరకు ఆస్తులు పోగొట్టుకుని అష్టకష్టాల్లో ఉన్నారని చెప్పారు. జిందాబాద్‌లు కొట్టించుకోవడం, ఉనికి చాటుకోవడానికి ప్రచారాలు చేసుకోవడం మానుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

