హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతానికి కొత్తగా పాలిటెక్నిక్ కాలేజీ మంజూరయ్యింది. బాలురు, బాలికలకు రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరుచేస్తూ ప్రభుత్వం జీవో-65 విడుదల చేసింది. మొత్తం ఆరు కోర్సులతో 2025-26 విద్యాసంవత్సరంలో కాలేజీని ప్రారంభిస్తారు.
ఒక్కో కోర్సులో 60 సీట్లుంటాయి. కాలేజీ కోసం 94 పోస్టులు, రూ. 70కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరో 20-30 కాలేజీల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మరో 14 పాలిటెక్నిక్ కాలేజీలకు పోస్టులు మంజూరుచేయాల్సి ఉంది.