అమ్రాబాద్ అడవుల్లో కొత్త మొక జాతి
తెలంగాణలో నీటి వనరులు, తేమ ప్రాంతాల్లో సరికొత్త మొక జాతిని పరిశోధకులు గుర్తించారు. రాష్ట్రం పేరు మీదుగా ఈ మొకకు అమ్మానియా తెలంగాణెన్సిస్ అని నామకరణం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలతోపాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న వట్వర్లపల్లి వద్ద ఈ మొకలను కనుగొన్నారు.
- ‘అమ్మానియా తెలంగాణెన్సిస్’గా నామకరణం
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో నీటి వనరులు, తేమ ప్రాంతాల్లో సరికొత్త మొక జాతిని పరిశోధకులు గుర్తించారు. రాష్ట్రం పేరు మీదుగా ఈ మొకకు అమ్మానియా తెలంగాణెన్సిస్ అని నామకరణం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలతోపాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న వట్వర్లపల్లి వద్ద ఈ మొకలను కనుగొన్నారు. ఈ కొత్త జాతి లిత్రేసి వృక్ష కుటుంబానికి చెందినది. అంతర్జాతీయ వర్గీకరణ శాస్త్ర పత్రిక ‘ఫైటోటాక్సా’ జర్నల్‌లో ఈ ఆవిషరణ వివరాలు ప్రచురితమయ్యాయి.
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా(బీఎస్ఐ) డెకన్ రీజినల్ సెంటర్‌కు చెందిన అరికృష్ణన్ పార్థిబన్, లదన్ రసింగం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకుడు సిద్ధార్థన్ సర్వేశ్వరన్, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన సంధ్య దీపికా దేవర కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ మొకకు కాడలపై వికసించే పూల గుత్తులు(మెజెంతా రంగు రేకులు) ఉంటాయి. దీని విత్తనాల ఉపరితలం మానవ మస్తిషం(బ్రెయిన్) ఆకారాన్ని పోలి ఉండే విలక్షణమైన రూపాన్ని కలిగి ఉండటం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

