హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ఐఐటీ హైదరాబాద్‌కు త్వరలో నూతన డైరెక్టర్ నియమితులుకానున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ప్రస్తుతం ఐఐటీహెచ్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ బీఎస్ మూర్తి కొనసాగుతున్నారు. మద్రాస్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన ఐదేండ్ల క్రితం ఐఐటీహెచ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆయన పదవీకాలం త్వరలోనే ముగియనుండటంతో నూతన డైరెక్టర్‌ను కేంద్రం నియమించనున్నది. రాష్ట్రంలో ఇటీవలే ఏర్పాటైన సమక్క సారక్క గిరిజన వర్సిటీకి కూడా నూతన వీసీ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ వర్సిటీలో బీఏ ఆనర్స్ (ఇంగ్లిష్), బీఏ ఆనర్స్ (సోషల్ సైన్సెన్స్) కోర్సులను నిర్వహిస్తున్నారు. సీయూఈటీ (యూజీ) స్కోర్ ఆధారంగా ఈ రెండు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వీసీని ఇన్చార్జి వీసీగా బాధ్యతలు అప్పటించారు.