హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగా ణ): జూలై 1 నుంచి అమల్లోకొస్తున్న కొత్త క్రి మినల్ చట్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ కే సురేందర్ అభిప్రాయపడ్డారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియమ్లోని చేర్పులను, పాత చట్టాల్లో ఉంచిన సెక్షన్లను యువ న్యాయవాదులు పూర్తిగా అవగాహన చే సుకోవాలని చెప్పారు. కొత్త క్రిమినల్ చట్టాలపై నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ లా కాలేజీలో ఆదివారం ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. బాధితుల హ క్కుల పరిరక్షణ, సమర్థవంతంగా విచారణ ని ర్వహణకు కొత్తచట్టాలు ఉపయోగపడుతాయని తెలిపారు. 150 ఏండ్ల నాటి చట్టాలు నేటితో కనుమరుగు కానున్నాయని, సాంకేతిక అంశాలతో కొత్త చట్టాల రూపకల్పన అభినందనీయమని హైకోర్టు జస్టిస్ మాధవి పేర్కొన్నారు.
ఏదై నా నేరం జరిగితే నిరూపించేందుకు, వాదించేందుకు, తీర్పులు చెప్పేందుకు నిర్ణీత సమయం ఇచ్చారని, తప్పనిసరిగా ఆ సమయంలో సం బంధిత విభాగం స్పందించాల్సిందేనని చెప్పా రు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ దేశ పరిస్థితులు, కాలానికి అనుగుణం గా కొత్త చట్టాలు రావాల్సిన ఆవశ్యకత ఉందని, ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం మూడు కొత్త చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని చెప్పారు. పాత చట్టాల్లోని మంచిని స్వీకరిస్తూనే, మన దేశ పరిస్థితులకు అనుగుణంగా కొత్తవి రూపొందిచుకోవడం గొప్ప విషయమని తెలిపారు. యువ న్యాయవాదులకు ఉపయోగపడేలా వర్క్‌షాప్ నిర్వహించిన ఫో రం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా కొత్త చట్టాలపై రూపొందించిన పుస్తకాలను ఎంపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఏ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ అడ్వకేట్ ఎన్ రామ్‌చందర్‌రావు, సీనియర్ అడ్వకేట్లు బీ నారాయణరెడ్డి, బీ నర్సింహశర్మ, జే ప్రభాకర్, అశోక్ ఆనంద్‌కుమార్, డీఐజీ రెమా రాజేశ్వరి, కేశవ్ లా కాలేజీ ప్రిన్సిపాల్ వాణి, ఓయూ లా కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి ప్రసంగించారు.