హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో రేడియేషన్ ఆంకాలజీ విభాగం కొత్త సీఎంఈ సిరీస్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. గర్భాశయ, ఎండోమెట్రియల్, సర్వైకల్ క్యాన్సర్లకు సంబందించిన చికిత్సల్లో ఇటీవల సాధించిన పురోగతులపై ఈ కార్యక్రమంలో చర్చించినట్టు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 350 మంది గైనకాలజిస్టులు, ఆంకాలజిస్టులు హాజరైన ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సునీత ములింటితోపాటు ప్రముఖ వైద్య నిపుణులు ప్రొఫెసర్ శాంత కుమారి, డాక్టర్ సునీత అల్లంకి, డాక్టర్ చిన్నబాబు సుంకపల్లి, డాక్టర్ బెతునే నాయుడు, డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.