Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 1 : శ్రీలంకలో నూతన గబ్బిలం జాతిని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. ఇవి ఆకు ఆకారంలో ముక్కును కలిగి ఉంటాయి. ‘హిప్పోసిడరోస్ శ్రీలంకన్సిస్’ అని ఈ జాతి గబ్బిలాన్ని డాక్టర్ భార్గవి శ్రీనివాసులు కనిపెట్టారు. ప్రొఫెసర్ సీ శ్రీనివాసులు పర్యవేక్షణలో భారతదేశం, శ్రీలంక, ఐలాండ్ దేశాలకు చెందిన జీవశాస్తవ్రేత్తలతో కలిసి ఆమె ఈ పరిశోధన సాగించారు. సంబంధించిన పరిశోధనా పత్రం ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ టాక్సానమీ జర్నల్ ‘జూటాక్సా’లో ప్రచురితమైంది.