హైదరాబాద్, ఆగస్టు30 (నమస్తే తెలంగాణ): 20 రాష్ర్టాలకు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను ని యమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేశారు. తెలంగాణకు ఏఐసీసీ సెక్రటరీగా పీసీ విష్ణునాథ్, జాయింట్ సెక్రటరీగా విశ్వనాథన్‌ను నియమించింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను ఛత్తీస్గడ్ కాంగ్రెస్ సెక్రటరీగా నియమించింది. ఇక ఏపీ సెక్రటరీ గణేశ్‌కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా పాలక్వర్మను ఏఐసీసీ ప్రకటించింది.
ఏడు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఏడు మార్కెట్ కమిటీల కు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ వ్యవసాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు 39 మా ర్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ని యమించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. మహబూబ్‌నగర్, జగిత్యాల జిల్లాలోని వెల్గటూ రు, కామారెడ్డి జిల్లాలోని గాంధారి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మారెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించింది.
‘వాహన్’లోకి ఆర్టీఏ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఒకే దేశం-ఒకే పోర్టల్ పేరిట కేంద్రం.. రవాణా శాఖలో తీసుకొచ్చిన వాహన్ పోర్టల్ లో మరో రెండు వారాల్లో రాష్ట్రం చేరబోతున్నది. 2019లోనే పోర్టల్ అందుబాటులోకి వచ్చినా సీఎఫ్ఎస్టీ సాఫ్ట్వేర్ సులభతరంగా ఉండటంతో అప్పటి ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించలేదు. ప్రస్తుతం సీఎఫ్ఎస్టీకి బదులుగా వాహన్ పోర్టల్‌లో ఆర్టీఏ చేర్చడానికి ప్రణాళికలు రచించా రు. తొలుత సికింద్రాబాద్ నుంచి పోర్ట ల్ సేవలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే రవాణాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేస్తున్న ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కేంద్ర రవాణాశాఖ నిబంధనల మేరకు ఉన్నాయి. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో ఎక్కడి నుంచైనా ఆర్టీఏ సేవలు పొందవచ్చు.
‘టామ్‌కామ్’లో దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ ): సౌదీ అరెబియాలోని వేర్‌హౌజ్ అసోసియేట్స్ ఉద్యోగాలకు టామ్‌కామ్ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 7013361343, 9985483931 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. మల్లెపల్లి క్యాంప స్ ఐటీఐ కాలేజీలో 4న ఎన్రోల్మెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.