హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): లంచం అడగాలంటేనే హడల్ పుట్టా లి.. రెండు సార్లు లంచం తీసుకుంటూ పట్టుబడితే ఉద్యోగాన్నే ఊడగొట్టాలి.. దీనికోసం కఠిన చట్టాలు రావాలి.. అంటూ పలువురు నెటిజన్లు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ పలువురు అభిప్రాయాలను పంచుకున్నారు. కఠిన చట్టా లు లేకపోవడంతోనే లంచాధికారులు రెచ్చిపోతున్నారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చట్టాలుంటే మరోసారి డబ్బు తీసుకునేందుకు అధికారులు వెనుకాడతారని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను ఉదహరిస్తూ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేయగా.. ఆయన ‘అందుకు పూర్తిగా అంగీకరిస్తున్నాను’ అంటూ తన అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రజలకే సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు లంచాల పేరుతో సామాన్యులను పీడిస్తే కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు రావల్సిన ఆవశ్యకత ఉం దని సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు.
సుధాకర్ ఉడుముల అనే సీనియర్ జర్నలిస్టు.. సూ ర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి ఠాకూర్ రూపేందర్‌సింగ్ తాజా వ్యవహారాన్ని ఉదహరించారు. ఇటీవల ఆయన రూ.25 వేల లం చం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ఆయన ఇలా దొరకడం ఇది మూడోసారి కావడంతో జర్నలిస్టులు సహా ప లువురు కొత్త చట్టాలు రావల్సిన ఆవశ్యకతను వెలిబుచ్చారు. ‘ఇప్పటికే ఠాకూర్ రూపేందర్‌సింగ్‌ను మూడోసారి ఏసీబీ సిబ్బంది పట్టుకున్నారు. అయినా అతనిపై ఎలాంటి చర్యలు లే వు.
సగం వేతనంతో 6 నెలలపాటు సస్పెండ్ చేస్తారేమో. ఆ తర్వాత మళ్లీ అతను ఇలాగే లంచాల కోసం ప్రజలను వేధిస్తూనే ఉం టాడు’ అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇందుకు సీవీ ఆనంద్ స్పందిస్తూ.. ‘కొన్ని చట్టాలు సున్నితమైనవి, మరికొన్ని పరిమితికి లోబడి ఉన్నాయి. ఏం చేస్తాం’ అంటూ రీ పోస్టు చేశారు. ఇందుకు దేవరాజ్ అనే నెటిజన్ స్పందిస్తూ కఠిన చట్టాలు రావాల్సిందేనని తెలిపారు. తానూ ఏకీభవిస్తున్నట్టు సీవీ ఆనంద్ సమాధానం ఇచ్చారు. ఇకనైనా ప్రభుత్వం కఠిన చట్టాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు, సామాన్యులెందరో అభిప్రాయాలు వ్యక్తం చేశారు.