హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నేతన్న బీమా, పావలా వడ్డీ, జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి నేతృత్వంలో చేనేత సంఘాల నాయకులు శనివారం సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విన్నవించారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేయాలని, 65 ఏండ్లలోపు మరణించిన చేనేత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని సూచించారు. విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సంఘం నేతలు తెలిపారు.