అమ్రాబాద్, ఫిబ్రవరి 12 : ప్రపంచ సామాజిక వేదిక సదస్సుకు నల్లమల రచయిత ఎంపికయ్యారు. ఈనెల 15 నుంచి 19 వరకు నేపాల్ రాజధాని కఠ్మాండ్ నగంలో జరిగే డబ్ల్యూఎస్ఎఫ్లో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామ యాక్షనైడ్ సంస్థ నుంచి రచయిత చెవ్వ రఘుపతిరావుకు అవకాశం దక్కింది. ఇందులో వివిధ దేశాలు, రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొంటారని, ప్రధానంగా మానవ హక్కుల పరిరక్షణ, దళిత, మహిళా హక్కులు, లిబరలైజేషన్, ప్రైవేటు, గ్లోబలైజేషన్తోపాటు అనేక అంశాలపై ప్రతినిధులు ప్రసంగిస్తారని రఘుపతిరావు తెలిపారు.