విధుల్లో అలసత్వాన్ని సహించం.. జగిత్యాలలో రెవెన్యూ, హౌసింగ్‌పై మంత్రి పొంగులేటి సమీక్ష
ప్రజా సమస్యల పరిషారంలో నిర్లక్ష్యం, అవినీతి, విధుల్లో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
- ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ సస్పెన్షన్‌కు ఆదేశం
జగిత్యాల, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిషారంలో నిర్లక్ష్యం, అవినీతి, విధుల్లో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఆయన మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి పా ల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కలెక్టర్లతోపాటు, ఇతర అన్నిశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో చేపట్టిన సమీక్ష మొదటి సమావేశమని, ఇకపై అన్ని జిల్లాల్లోనూ అధికారులతో సమీక్ష సమావేశా లు నిర్వహిస్తామని తెలిపారు.
విధుల్లో నిర్ల క్ష్యం వహించిన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులకు షోకాజ్ నో టీసులు జారీ చేయాలని సూచించారు. అధికారులు వారికి కేటాయించిన హెడ్క్వార్టర్లలో నివాసం ఉంటున్నారా? లేదా? అనే అంశం పై నివేదిక తెప్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసినట్టు మహిళ ఫిర్యాదు చేసిన ఘటనపై తహసీల్దార్‌ను వివరణ కోరాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల మొదటి దశలోని ఎల్-3 సమస్యలను ఈ నెలాఖరులోగా పరిషరించాలని ఆదేశించారు. 22ఏ, అసైన్డ్ భూముల కేసులను పారదర్శకంగా, వేగంగా పరిషరించాలని, అవసరమైతే 24 గంటలూ పనిచేయాలని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

