హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 30న పరీక్ష నిర్వహించనున్నట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) వెల్లడించింది. బుధవారం సాయంత్రం 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, జూలై 21 వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఇంకా చదవల్సిన వార్తలు
ఏపీ ఎప్‌సెట్‌లో తెలంగాణ విద్యార్థుల సత్తా
ఏపీ ఎప్‌సెట్ ఫలితాల్లో తెలంగాణ వాసులు సత్తాచాటారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన తెల్లూరి శ్రేయాస్‌రెడ్డి టాప్-5 (94.32 స్కోర్‌తో) ర్యాంకులో నిలిచాడు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో కూకట్‌పల్లికి చెందిన కుడుముల వెంకట మహంత్ అక్షజ్రెడ్డి 91.8114 స్కోరుతో టాప్-2గా నిలిచి సత్తాచాటాడు.