కోటగిరి, మే 12: మటన్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఒకరు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులతండాలో ఆదివారం చోటుచేసుకున్నది. కోటగిరి ఎస్సై సునీల్ వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లికి చెందిన రుత్వన్ తారా సింగ్(48) భార్యతో కలిసి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులంతండాలోని బంధువుల ఫంక్షన్లో భోజనం చేస్తుండగా, మటన్ముక్క గొంతులో ఇరుక్కుని మృతిచెందాడు. మృతుడి భార్య రుత్వన్ యమునాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.