హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని టీఐఎఫ్ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను జాతీయ రక్షణ కళాశాల(ఎన్డీసీ) బృం దం సోమవారం సందర్శించింది. జాతీ య భద్రత, వ్యూహాత్మక అధ్యయనాల్లో భాగంగా 16 మంది సభ్యుల బృందం ఈ నెల 7 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్‌తోపాటు మరికొన్ని పారిశ్రామిక యూనిట్లను ఈ బృందం సందర్శించి పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరిపింది. రాష్ట్ర పారిశ్రామిక పార్క్ అభివృద్ధి మోడల్‌పై బృందం ప్రశంసలు కురిపించింది. ఈ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలుచేయవచ్చని అభిప్రాయపడింది.