హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ కేంద్రంపై దాడి
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టయింది. భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
- 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
- ముగ్గురు నిందితుల అరెస్టు
హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టయింది. భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం మౌలాలీ పరిధిలో భారీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దొరికిన సుమారు రూ.17 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారుల బృందం సీజ్ చేసింది.
మౌలాలీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలోని ఒక కర్మాగారంలో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 69.6 కిలోల నిషిద్ధ డ్రగ్స్ పట్టుబడిందని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ను నిందితులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

