NBWL | తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర వైల్డ్‌లైఫ్ బోర్డు గ్రీన్ సిగ్నల్..!
NBWL | రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దాంతో కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకం లైన్ క్లియర్ అయ్యింది. అలాగే రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన నేషనల్ వైల్డ్‌లైఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
NBWL | రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దాంతో కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకం లైన్ క్లియర్ అయ్యింది. అలాగే రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన నేషనల్ వైల్డ్‌లైఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రానికి సంబంధించి పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న 23 అభివృద్ధి పనులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో ఈ మేరకు చర్చించి, అనుమతి ఇచ్చింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుపై నిర్మించ తలపెట్టిన లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ (ఖానాపూర్ పరిధి) పథకానికి పర్మిషన్ ఇచ్చింది.
సాగునీటి శాఖ ప్రతిపాదనలను అటవీశాఖ నిబంధనల మేరకు వైల్డ్‌లైఫ్ బోర్డు ద్వారా అనుమతులు సంపాదించింది. 3.17 హెక్టార్ల అటవీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమావేశానికి హాజరైన అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణ, వెడల్పుకు సంబంధించిన 11 ప్రతిపాదనలకు, ఐదు పంచాయతీ రాజ్ రోడ్లకు, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో విద్యుత్ లైన్ ప్రతిపాదనకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

