చార్మినార్, మార్చి 2: నిజాం వారసుడిగా నవాబ్ రౌనక్ఖాన్ను ఏకగ్రీవంగా ప్రకటించినట్టు నిజాం వారసత్వ కమిటీ గురువారం వెల్లడించింది. మొఘల్పురలోని ఆజం ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన నిజాం కుటుంబసభ్యులు.. నిజాం వారసుడిగా 9వ నిజాంగా నవాబ్ రౌనక్ఖాన్ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఇక నుంచి రౌనక్ఖాన్ నేతృత్వంలో నిజాం ట్రస్ట్ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు రౌనక్ఖాన్కు అపురూపమైన బహుమతులను అందించి అభినందించారు.