న్యూఢిల్లీ : భారత నావికా దళం సముద్ర భద్రతలో తన సత్తాను మరోసారి చాటిచెప్పింది. గత ఏడాది డిసెంబర్ 14న సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఎంవీ రుయెన్ నౌకను వీరోచితంగా పోరాడి కాపాడింది. 35 మంది సముద్రపు దొంగలను లొంగదీసుకుని, 17 మంది సిబ్బందిని రక్షించింది. దొంగల స్వాధీనంలో ఉన్న నౌకను ఐఎన్ఎస్ కోల్కతా నౌక ఈ నెల 15న అడ్డుకోగలిగింది. దీనికి ఐఎన్ఎస్ సుభద్ర, హెచ్ఏఎల్ఈ ఆర్పీఏ, పీ8ఐ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, సీ-17 యుద్ధ విమానం నుంచి దిగిన మార్కోస్-ప్రహర్స్ సహకరించారు. ఎవరూ గాయపడకుండా ఈ లక్ష్యాన్ని సాధించారు.