హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విద్యా పరిశోధన శిక్ష ణ సంస్థలో ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టు ల్లో స్కూల్ అసిస్టెంట్లు కొనసాగుతున్నట్టు పాఠశాలవిద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టంచేశారు. స్కూల్ అసిస్టెంట్లు అదననపు బాధ్యతల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు.
‘4,530 మంది టీచర్లు బడికి రావట్లే’ శీర్షిక పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ టీచర్‌ను ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా బాధ్యతల నుంచి తప్పించామని పేర్కొన్నారు.