హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ): ఐఐటీ హైదరాబాద్(ఐఐటీహెచ్)లో నేటి నుంచి రెండ్రోజులపాటు నేషనల్ వెల్బీయింగ్ కాంక్లేవ్ జరుగనున్నది. జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సును ఉన్నత విద్యా సెక్రటరీ సంజయ్‌మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెస ర్ బీఎస్ మూర్తి, విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ రైనా సోనోవాల్ కౌలి ప్రారంభించనున్నారు.
‘మానసిక ఆరోగ్యం పెంపు, మానసిక సమస్యల పరిష్కారమే’ లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మానసిక ఆరోగ్య నిపుణులు విద్యార్థులు, అధ్యాపకులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.