హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో ఓబీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ 18,19వ తేదీల్లో ‘చలో ఢిల్లీ’ పేరిట జాతీయ సెమినార్ నిర్వహించ నున్నట్టు ఎంపీ, జాతీయ బీసీ సంఘం అధ్యకుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం ప్రకటనలో వెల్లడించారు.
సెమినార్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రా ల నుంచి ప్రొఫెసర్లు, మేధావులు, ఎనిమిది మంది కేంద్రమంత్రులు, 20 మంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీ లు పాల్గొంటారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా జనగణనలో కులగణన చేపడుతున్నదని, తద్వారా రాబోయే రోజుల్లో సమాజం లో విప్లవాత్మక మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కులగణన తర్వా త బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల పెంపు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పా టు, రూ. 2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకాల అమలు అంశాలపై సెమినార్లో చర్చించనున్నట్టు వెల్లడించారు.