హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): జాతీయ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (దౌర్జాన్యాలు-అత్యాచారాల నిరోధక) చట్టం కింద బాధితులకు నగదు సహాయం చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
తాము ఇచ్చిన ఫార్మాట్లో బాధితుల వివరాలను, అందించిన సహాయాన్ని నోటీసు అందుకున్న 15 రోజుల్లోగా ఎన్సీఎస్సీ పోర్టల్/పోస్ట్/ఈమెయిల్, లేదా వ్యక్తిగతంగా సమర్పించాలని ఆదేశించింది.