హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జిల్లా, మండలస్థాయి కోర్టుల్లో మొత్తం 10,35,520 కేసు లు పరిషారమయ్యాయి. వీటిలో 4,543,909 పెండింగ్ కేసులు, 5,81,611 ప్రిలిటిగేషన్ కేసులు ఉన్నాయి. లబ్ధిదారులకు పరిహారంగా రూ.743 కోట్లు ప్రకటించినట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి తెలిపారు. లోక్ అదాలత్‌లో భాగం గా హైకోర్టులో 132 కేసులు పరిషారమయ్యాయి. ఇందులో 96 మోట రు వాహనాల చట్టానికి చెందిన కేసులు ఉన్నాయి. ప్రాథమిక దశలో ఉన్న మరో 31 కేసులు కూడా ఉన్నా యి. ఈ కేసుల పరిషారం ద్వారా రూ.9.5 కోట్లను పరిహారంగా ప్రకటించగా, 900 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం శాంతివర్ధిని తెలిపారు.