Koteshwar Rao | కరీంనగర్ కమాన్చౌరస్తా, ఆగస్టు 17: నమస్తే తెలంగాణ దినపత్రిక, ములనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహిస్తున్న 2023-24 జాతీయస్థాయి తెలుగు కథల పోటీల్లో కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణ కేంద్రంలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పశువైద్యాధికారి డాక్టర్ ఎం కోటేశ్వరరావు ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. తలపండిన రచయితలు పాల్గొంటున్న ఈ పోటీల్లో ఒక సాధారణ పశువైద్యాధికారి ప్రథమ బహుమతిని గెలుపొందటం విశేషం.
ఆయన రూ.50 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, మెమెంటో అందుకోనున్నారు. తనకున్న సాహిత్య అనుభవం వృత్తిలో రాణించడానికి, రైతులకు వందల సంఖ్యలో సాంకేతిక వ్యాసాలు రాయటానికి ఎంతో దోహదం చేసిందని డాక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. ఆయన్ను సంబంధిత శాఖ అధికారులు అభినందించారు.