కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో 7వ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ సీఎస్‌కేఐ కప్-2022 పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సినీనటుడు, హీరో సుమన్, నగర సీపీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని సీఎస్‌కేఐ చైర్మన్ హరిశంకర్, బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్‌తో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు జరుగనున్న ఈ జాతీయస్థాయి కరాటే పోటీల్లో 22 రాష్ర్టాల నుంచి 1500 మంది క్రీడాకారులు హాజరవుతారని నిర్వాహకులు పేర్కొన్నారు. సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ కరాటే క్రీడ అందరికీ అవసరమని, విద్యార్థినులు, మహిళలు తప్పకుండా నేర్చుకోవాలన్నారు.