హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరం నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ఈ నెల 11 నుంచి 24 వరకు జాతీయ చేనేత ప్రదర్శన2023 నిర్వహించనున్నట్టు రాష్ట్ర చేనేత, వస్త్ర శాఖ కమిషనర్ బుద్ధా ప్రకాశ్ జ్యోతి తెలిపారు. చేనేత వస్ర్తాల విక్రయాల పెంపు, వాటి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం తేవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొని, తమ ఉత్పత్తులను 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు ధరలకే విక్రయిస్తారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రదర్శనలో పాల్గొనేలా చూడాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆయన లేఖ రాశారు.