హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేకు ఆరు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు వచ్చినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎస్సీఆర్ అవార్డులను అందుకున్నది.
గుంతకల్‌లోని రైల్వే దవాఖాన, రేణిగుంట రైల్వేస్టేషన్‌కు ప్రథమ, జమ్మికుంట రైల్వేస్టేషన్‌కు ద్వితీయ బహుమతి దక్కింది. లాలాగూడ సెంట్రల్ దవాఖాన, హైదరాబాద్, నిజామాబాద్ రైల్వేస్టేషన్లకు మెరిట్ సర్టిఫికెట్లు వచ్చినట్టు తెలిపారు.