వాణిజ్య కేంద్రాల చెత్తపై నజర్
పట్టణ ప్రగతి’తో నివాస ప్రాంతాలు శుభ్రంగా మారడంతో వాణిజ్య కేంద్రాలను కూడా చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యర్థాల తొలగింపునకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
- వ్యర్థాల తొలగింపునకు ప్రభుత్వ ప్రత్యేక ప్రణాళిక
- మార్గదర్శకాలు విడుదల
- రోజుకు రెండుసార్లు సేకరణ
- వాహనాలు, సిబ్బంది రెడీ
హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): ‘పట్టణ ప్రగతి’తో నివాస ప్రాంతాలు శుభ్రంగా మారడంతో వాణిజ్య కేంద్రాలను కూడా చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యర్థాల తొలగింపునకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం అన్ని కార్పొరేషన్లు, పట్టణ స్థానిక సంస్థలకు మార్గదర్శకాలు జారీచేసింది. వాణిజ్య ప్రాంతాలను ‘లిట్టర్ ఫ్రీ ఏరియా’లుగా తీర్చిదిద్దడం వల్ల స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో మెరుగైన ర్యాంకు సాధించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. స్వచ్ఛ సర్వేక్షణ్‌తోపాటు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో భాగంగా ప్రభుత్వం పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చేందుకు పెద్దఎత్తున చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.
నివాస ప్రాంతాల్లో రోజుకొకసారి ఇంటింటి చెత్త సేకరణ జరుపుతున్నా వాణిజ్య ప్రాంతాల్లో ని త్యం వ్యర్థాల ఉత్పత్తితో ఆ ప్రాంతాల్లో సమ స్య జటిలమవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాణిజ్య ప్రాంతాలపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయగా, తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, హా స్టళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫంక్షన్‌హాళ్లు, చికెన్ సెం టర్లు, నాన్‌వెజ్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, వారాంతపు మార్కెట్లు, వాణిజ్య సంస్థలు తదితర వాటిపై దృష్టి సారిస్తారు.
జనాభా, దుకాణాల ఆధారంగా గుర్తింపు
నివాస ప్రాంతాల్లో దుకాణాలు ఉంటే వా టిని కూడా జనాభా, దుకాణాల ఆధారంగా వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించనున్నారు. కనీ సం 25 వేలకుపైగా జనాభా ఉండి 10 దుకాణాలు, 25 వేలు-50 వేలు జనాభా ఉండి 20 దుకాణాలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉండి 50 దుకాణాలు, లక్ష నుంచి 3 లక్షల జనాభాకు 75 దుకాణాలు, 3 లక్షలకుపైగా జనాభా ఉండి 100 దుకాణాలు ఉన్న ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించనున్నారు.
దుకాణాలు, బల్క్ గార్బేజ్ ఉత్పత్తిదారుల నుంచి రోజుకు రెండుసార్లు వ్యర్థాలు సేకరిస్తారు. దుకాణదారులు తడి, పొడి చెత్తతోపాటు హానికర వ్యర్థాల కోసం మూడు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకొని సిబ్బందికి అందించాలి. వ్యర్థాల సేకరణ, రవాణా కోసం టెండర్ ప్రక్రియ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయాలని పట్టణ స్థానిక సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి వాణిజ్య సంస్థలో తడి చెత్తకోసం ఆకుపచ్చ, పొడి చెత్త కోసం నీలంరంగు, హానికర డొమెస్టిక్ వ్యర్థాలకు ఎరుపు రంగు డబ్బాలను ఏర్పాటు చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

