ఎన్డీడీబీకి ‘నార్మూల్’ అప్పగింత
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్(నార్మూల్), నేషనల్ డెయిరీ డెవలంప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మంగళవారం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది.
- మంత్రి శ్రీహరి సమక్షంలో రూ.10 కోట్ల చెక్కు అందజేత
హయత్‌నగర్ / హైదరాబాద్, మే12 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్(నార్మూల్), నేషనల్ డెయిరీ డెవలంప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మంగళవారం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా 15 ఏండ్లపాటు డెయిరీని అభివృద్ధి చేసే బాధ్యతను ఎన్డీడీబీ తీసుకోనున్నది. ఒప్పందంలో భాగంగా పాడిరైతుల బకాయిలు చెల్లించేందుకు సంస్థ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డికి ఎన్డీడీబీ సంస్థ ప్రతినిధులు రూ.10 కోట్ల చెక్కును అందజేసినట్లు పేర్కొన్నారు. పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పశుసంవర్ధక, డెయిరీ, ఫిషరీస్ సెక్రటరీ ఇలాంబర్త్తి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఎన్డీడీబీ అధికారులు, నార్ముల్ మదర్ డెయిరీ మేనే జింగ్ డైరెక్టర్ కాటిపల్లి లింగారెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

