నరెడ్కో ఆధ్వర్యంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన ఎక్స్పో సందర్శకులు లేక వెలవెలబోయింది. ఎక్స్పోను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకుపోతున్నదని చెప్పగా.. అందుకు భిన్నమైన దృశ్యం సదస్సులో కనిపించింది.
కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల గురించి ఏర్పాటు చేసిన స్టాళ్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి.