K. Narayana | తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సవతుల పోరు నడుస్తోంది అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఇటీవల కాలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల అంతర్గత కలహాల వల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుం దన్నారు. రేవంత్ రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, ఏ తప్పూ చేయకుండా ఉంటేనే మంత్రులు, కిందిస్థాయి అధికారుల్లో భయం ఉంటుంది. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టిపెట్టాలని పరోక్షంగా సూచించారు.
22ఏ భూముల నిబంధనను కొందరు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామి కాదు, ఎన్నికల్లో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే చేసుకున్నామని పేర్కొన్నారు. తమ సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల అసంతృప్తిపెరుగుతుందన్నారు.