హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఎప్సెట్ -25 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు సంచలనాలు ఆవిష్కరించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మా విభాగాల్లో రెండు ఫస్ట్ ర్యాంకులతో చరిత్ర సృష్టించినట్టు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో భరత్ చంద్ర, అగ్రికల్చర్/ఫార్మా విభాగంలో పీ సాకేత్ రెడ్డి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. రెండు విభాగాల్లో టాప్ 10లోపు 5 ర్యాంకులు, టాప్ 100లోపు 54 ర్యాంకులు, టాప్ 500లోపు 265 ర్యాంకులు, టాప్ 1000లోపు 492 ర్యాంకులు ఒక్క నారాయణకు మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించామని పేర్కొన్నారు.
ఇంజినీరింగ్లో టాప్ 100లోపు 39 ర్యాంకులు, అగ్రికల్చర్/ఫార్మా విభాగంలో టాప్100లోపు 15 ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. 46 ఏండ్లుగా ఇంజినీరింగ్, మెడికల్లో టాప్ ర్యాంకులు సాధించిన ఘనత నారాయణ విద్యా సంస్థలదేనని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్-2025లో 300కి 300 మార్కులను ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన బణి బ్రత మాజీ, నారాయణ విద్యార్థి కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి నారాయణ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప అభినందనలు తెలిపారు.