గురువారం 28 మే 2020
Telangana - May 12, 2020 , 01:48:14

లైంగిక వేధింపుల బాధితుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో రాయొద్దు

లైంగిక వేధింపుల బాధితుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో రాయొద్దు

  • పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లైం గిక వేధింపుల బాధితుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఐపీసీ సెక్షన్‌ 228ఏ, పోక్సో చట్టం, ‘నిపుణ్‌ సక్సేనా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీంకో ర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం లైంగిక వేధింపులకు గురైన బాధితులు, వారి తల్లిదండ్రుల పేర్లు, గుర్తింపును వెల్లడించరాదని స్పష్టంచేసింది. కేంద్ర ప్ర భుత్వ విద్యాసంస్థలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న వ్యక్తి అక్కడి విద్యార్థినిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణల కేసు విచారణలో దర్యా ప్తు అధికారులు ఎఫ్‌ఐఆర్‌, రిమాండ్‌ రిపోర్ట్‌, చార్జిషీట్‌లో యథేచ్ఛగా విద్యార్థిని, తల్లిదండ్రుల పేర్లను ఉపయోగించడాన్ని జస్టిస్‌ పీ నవీన్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం తప్పుబట్టింది. కేసు ట్రయల్‌ ముగియకముందే శాఖపరమైన చర్యలు ఎలా తీసుకుంటారని నిం దితుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకో ర్టు.. కేవీ సొసైటీ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు చేపట్టవచ్చని, దానికి క్రిమినల్‌ కేసు విచారణకు సంబంధం లేదని పేర్కొన్నది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించేలా అన్ని ఠాణాలకు ఆదేశాలివ్వాలని డీజీపీకి సూచించింది. బాధితుల పేర్లను సీల్డ్‌ కవర్‌లో మాత్రమే అందించాలని తెలిపింది.బాధితుల పేర్లకు సంబంధించి విద్యాసంస్థలు, మీడియా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేలా మార్గదర్శకాలు రూపొందించాలని సీఎస్‌ను  ఆదేశించింది.  


logo