హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ అసిస్టెంట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ గడసంతల శ్రీనివాస్‌కు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. హై హక్టెన్ సంస్థ ప్రకటించిన ఈ అవార్డును ఈ నెల 24న శ్రీనివాస్ అందుకోనున్నారు. పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు తన బిడ్డతో వచ్చి చదువుకుంటున్న మహిళ చిత్రానికి బహుమతి వచ్చింది. యాదాద్రి వద్ద పీర్ల పండుగ ఊరేగింపు చిత్రానికి రాష్ట్రస్థాయి కన్సొలేషన్ బహుమతి లభించిందని శ్రీనివాస్ తెలిపారు.