తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 8: 2025సంవత్సరానికిగాను ధర్మనిధి పురస్కారాలను తెలంగాణ సారస్వత పరిషత్తు సోమవారం ప్రకటించింది. ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ పురస్కారానికి రా యారావు సూర్యప్రకాశ్‌రావు, ఆలూరి బైరాగి పురస్కారానికి వేముగంటి మురళీకృష్ణ, పాకాల యశోదారెడ్డి పురస్కారానికి సంధ్యావిప్లవ్, వారమామలై వరదాచార్య పురస్కారానికి పింగిలి సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసినట్టు పరిషత్తు ప్రధాన కార్యదర్శి జే చెన్నయ్య తెలిపారు. పొనుగోటి సరస్వతికి చింతపల్లి వసుంధరారె డ్డి జానపద విజ్ఞాన పురస్కారం, తూర్పు మల్లారెడ్డికి బెజవాడ గోపాల్‌రెడ్డి పురస్కారం, సాగి కమలాకరశర్మకు దివాకర్ల వెంకటావధాని పురస్కారం, కందుకూరి అంజయ్యకు రావికంటి వసునందన్ పురస్కారం, నమస్తే తెలంగాణ రిపోర్టర్ మ్యాకం రవికుమార్‌కు ఈనెల 18న విశాల సాహితీ పురస్కారం అందజేయనున్నట్టు వెల్లడించారు.
అంగన్వాడీ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి ; నవంబర్ 19లోగా పూర్తి చేయాలి : సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి వచ్చే ఇందిరాగాంధీ జయంతి నవంబర్ 19లోగా పూర్తి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ సెంటర్లకు సరుకుల సరఫరాపై ఆరా తీశారు. గత నెలలో 58శాతం మాత్రమే పాలు సరఫరా అయ్యాయని అధికారులు చెప్పగా.. మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలతో సహా ఎక్కడా సరుకులు అందించడంలో లోపం లేకుండా చూడాలని హెచ్చరించారు. గుడ్ల సరఫరాలో కలర్ కోడింగ్ పాటించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితారామచంద్రన్, డైరెక్టర్ సృజన పాల్గొన్నారు.