టీఆర్ఎస్లో చేరిన నల్లాల ఓదెలు.. కండువా కప్పిన కేటీఆర్
Nallala Odelu | చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు. నల్లాల ఓదెలు,
హైదరాబాద్ : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు. నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి దంపతులకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, చెన్నూరు, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.
అంతకుముందు ఓదెలు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నిన్నటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఓదెలు తన రాజకీయ జీవితాన్ని టీఆర్ఎస్తో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2010లో రాజీనామా చేసి.. మరోసారి గెలుపొందారు. 2014లోనూ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

